Sunday, November 24, 2024

ముమ్మరంగా బూస్టర్‌ డోస్‌.. కరోనా భయం నుంచి బయటపడుతున్న జనం

అమరావతి, ఆంధ్రప్రభ: కోవిడ్‌ భయం నుంచి జనం బయటపడుతున్నారు. మొదటి, రెండో విడతల్లో మరణమృదంగం మోగించిన కరోనా మూడో వేవ్‌ నుంచి క్రమేపీ ప్రభావం తగ్గుతోంది. నాల్గోవేవ్‌లో పొరుగున ఉన్న తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నామమాత్రం ప్రభావమే చూపింది. సకాలంలో ప్రభుత్వం సకాలంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు వెరసి కరోనా ప్రభావానికి కళ్ళెం వేశాయి. రాష్ట్రంలో 3.44 కోట్ల మందికి బూస్టర్‌ డోస్‌ వేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. యుద్ద ప్రాతిపదికన బూస్టర్‌ డోసు అందరికీ అందేలా చర్యలు చేపట్టారు. ఈనెల 15వ తేదీ నుంచి నుంచి 18నుంచి 59 సంవత్సరాల లోపు వారందరికీ బూస్టర్‌ డోసు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆజాదీకాఅమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజులపాటు దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో ఏపీలో బూస్టర్‌ డోసు కేవలం 45 రోజుల్లో పూర్తవుతోందని వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. బూస్టర్‌ డోసులు వచ్చినవి వచ్చినట్లు- వినియోగించుకునేలా సిబ్బందిని సన్నద్ధం చేశారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, వాలంటీ-ర్లు బూస్టర్‌ డోసు పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకుటున్నారు.

పీహెచ్‌సీలు, సచివాలయల్లో బూస్టర్‌ డోసు
రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, సచివాలయాల్లో బూస్టర్‌ డోసు పంపిణీ జరుగుతోంది. అక్కడే రిజిస్ట్రేష్రన్లు చేసి బూస్టర్‌ డోసు వేస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లు, కాలేజీలు, పాఠశాలలు, బస్‌ స్టేషన్లు, ఆయా కంపెనీలు, పారిశ్రామికవాడలు, ఇతర అన్ని పనిప్రాంతాల్లో బూస్టర్‌ డోసును అందుబాటు-లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ టీ-కాలు రెండు డోసులూ రాష్ట్రంలో 3.95 కోట్ల మందికి పంపిణీ చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించగా అంతకు మించి 4.35 కోట్ల మందికి కోవిడ్‌ టీ-కాలు రెండు డోసులు పంపిణీ జరిగింది. 60 ఏళ్లు పై బడిన వారిలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 36 లక్షల మందికి రెండో డోసులు కోవిడ్‌ టీకాలతో పాటు బూస్టర్‌ డోసు ఇచ్చారు. రాష్ట్రంలో రోజుకు 15 లక్షల మందికి టీకాలు వేసే సామర్థం మన రాష్ఠ్రాన్రికి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి బూస్టర్‌ డోసులు వెంటవెంటనే వచ్చేలా చర్యలు తీసుకుని కనీసం 45 రోజుల్లో పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రాథమికంగా 3.5 కోట్ల బూస్టర్‌ డోసులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్‌ పంపారు. రెండు డోసులు కలిపి రాష్ట్రంలో 8.54 కోట్ల కోవిడ్‌ టీ-కాలు పంపిణీ చేశారు. కేవలం 7.66 లక్షల మంది మాత్రమే ప్రైవేటు- ఆస్పత్రుల ద్వారా టీ-కా పొందారు. మిగిలిన అందరికీ ఉచితంగానే టీ-కాలు వేశారు.

అదుపులో కరోనా
రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉంది. అక్కడక్కడా చెదురుమదురుగా కేసులు నమోదవుతున్నప్పటికీ ఎలాంటి మరణాలు సంభవించడం లేదు. దీంతో ప్రజలు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నారు. అక్కడక్కడా కోవిడ్‌ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పంగా ఉంటుంది. రెండంకెల లోపు మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్యశాఖధికారులు చెబుతున్నారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement