వ్యవసాయం భారంగా మారిందని ..హెలికాఫ్టర్ కొనుక్కొవడానికి లోన్ ఇవ్వాలని బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు ఓ రైతు.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం చేయలేకపోతున్నానని, హెలికాప్టర్ కొనుక్కొని అద్దెకు తిప్పుకునేందుకు రూ.6.6 కోట్ల రుణం ఇవ్వాలని కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు ఆ రైత్తు. తక్టోడా గ్రామానికి చెందిన కైలాశ్ పతంగేకు 2 ఎకరాల భూమి ఉంది. అయితే సకాలంలో వర్షాలు రాక, కరువు పరిస్థితులతో కొన్నేండ్లుగా వ్యవసాయం చేయలేకపోతున్నానని, భారంగా మారిందని కైలాశ్ తెలిపాడు. గత రెండేండ్లు తన పొలంలో సోయాబీన్ వేశానని, ఆదాయం రాలేదన్నాడు. ‘కేవలం ధనవంతులకే పెద్ద కలలు ఉండాలని ఎవరు చెప్పారు.. రైతులు కూడా పెద్ద కలలు కనాలి’ అని అంటున్నాడు కైలాశ్ పతంగే. అందుకే గోరేగావ్ పట్టణంలోని ఒక బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేశానన్నాడు. మరి ఆ బ్యాంకు ఈ రైతుకి ఇంత మొత్తంలో లోన్ ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది.
భారంగా వ్యవసాయం – హెలికాఫ్టర్ కొనుక్కుంటా లోన్ ఇవ్వండి-ఓ రైతు వినతి
Advertisement
తాజా వార్తలు
Advertisement