విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)లు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో 34,605 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ వివరాల ప్రకారం 2023 జనవరిలో ఎఫ్‌పీఐలు 28,852 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 5,753 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇప్పటి వరకు ఎఫ్‌పీలు 34,605 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు.
విదేశీ ఇన్వెస్టర్లు 2021 అక్టోబర్ నుంచి మన దేశ స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం, ఇతర కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం, బాండ్లలో అధిక రాబడి వంటి కారణాలతో మన దేశ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. 2022లో ఇలా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 1,21,439 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. మన మార్కెట్లు స్థిరంగా ఉండకపోవడం కూడా ఇందుకు కారణం.