Friday, November 22, 2024

Heat Waves – వడగాల్పులకు ఉత్త‌రప్ర‌దేశ్​లో 166 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. బులంద్‌షహర్‌లో 48 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజుల్లో యూపీలో వేడి గాలులకు 166 మంది చనిపోయారు. సెంట్రల్ యూపీలో వేడిగాలుల కారణంగా 47 మంది చనిపోయారు.సెక్టార్ మేజిస్ట్రేట్, హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు రైల్వే కార్మికులు, హోంగార్డు, ఇంజనీర్‌తో సహా వారణాసి, పరిసర జిల్లాల్లో 72మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్‌లో 11 మంది, కౌశాంబిలో తొమ్మిది మంది, ప్రతాప్‌గఢ్‌లో ఒకరు, గోరఖ్‌పూర్‌లో ఒక బాలికతో సహా ముగ్గురు మరణించారు. అంబేద్కర్ నగర్‌లో నలుగురు, శ్రావస్తి, గోండాలో ఒక్కొక్కరు వడదెబ్బకు మృతి చెందారు. ఝాన్సీలో వడదెబ్బ తగిలి ఆరుగురు చనిపోయారు. ఘజియాబాద్‌లో ఒక శిశువుతో సహా నలుగురు, ఆగ్రాలో ముగ్గురు, రాంపూర్, లఖింపూర్ ఖేరీ, పిలిభిత్, షాజహాన్‌పూర్‌లో ఒక్కొక్కరు మరణించారు.

పేలుతున్న ట్రాన్స్ ఫార్మ‌ర్లు..
అధిక వేడితో ప‌లు ప్రాంతాల‌లో ట్రాన్స్ ఫార్మ‌ర్లు పేలిపోతున్నాయి. దీని కార‌ణంగా పలు చోట్ల కరెంటు కోతలతో గందరగోళం నెలకొంది. రానున్న వారం రోజుల పాటు ఎండ వేడిమి నుంచి విముక్తి ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. కరెంటు కోత కారణంగా విద్యుత్ శాఖపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో, ఝాన్సీ, లఖింపూర్ సహా పలు జిల్లాల్లో ప్రజలు బీభత్సం సృష్టించారు. రాయ్‌బరేలీలో కరెంటు కోతతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. అయోధ్య, గోండాలో కూడా అలజడి చెలరేగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement