అమరావతి, ఆంధ్రప్రభ: అసని తుఫాన్‌తో చల్లబడ్డ వాతావరణం గడిచిన ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. తీవ్రస్థాయిలోనూ వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న ఐదురోజుల్లో మరింత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెంటీ-గ్రేడ్ చొప్పున ఎక్కువగా నమోదు కావచ్చని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వడగాల్పుల ప్రభావం మరింత పెరుగుతుందని, ప్రజలు అవసరమైతే బయటకు రాకూడదని వాతావరణ, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..