అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నేడు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఐఎండీ అంచనాల ప్రకారం సోమవారం 116 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సోమవారం అల్లూరి జిల్లా 7, అనకాపల్లి 15, తూర్పుగోదావరి 8, ఏలూరు4, గుంటూరు6, కాకినాడ 9, కృష్ణా 6, నంద్యాల 4, ఎన్టీఆర్ 15, పల్నాడు 2, పార్వతీపురంమన్యం 10, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 1, విజయనగరం 13, వైఎస్ఆర్ 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆదివారం అనకాపల్లి 11, కాకినాడ 3, విజయనగరం3 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 100 మండలాల్లో వడగాల్పులు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.