తనతోటి స్నేహితులతో ఆడిపాడే వయసులో బాలిక గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా జోగణ్ణనకెరె గ్రామంలో జరిగింది. విద్యార్థిని సృష్టి (13) 8వ తరగతి చదువుతోంది.
పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు మూడిగెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూసింది. బిడ్డను కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.