Tuesday, November 19, 2024

Madhya pradesh | క్లాస్‌లోనే గుండెపోటు.. సివిల్‌ సర్వీస్ అభ్యర్థి కన్నుమూత !

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఉత్సాహంగా ఉన్న‌ప్ప‌టికీ క్ష‌ణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఇలాంటి విషాదకరమైన ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కోచింగ్ సెంట‌ర్‌లో పాఠాలు వింటున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఇండోర్‌లోని తన కోచింగ్ క్లాస్‌లో పాఠాలు వింటూనే గుండెపోటుతో మరణించాడు. బాధితుడిని సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధిగా (18) బాధితుడిని గుర్తించారు. క్లాస్‌ వింటూనే అకస్మాత్తుగా ఛాతి నొప్పితో బాధపడటం, పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి సాయం అందిచేందుకు ప్రయత్నించడం అంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన్ని సెకన్లలోనే అపాస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప‌క్క‌నున్న‌ విద్యార్థులు వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డి క్లాస్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement