Friday, November 22, 2024

యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. నాలుగు రోజుల వ్యవథిలోనే నలుగురు మృతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పట్టుమని 30 ఏళ్లు కూడా నిండకముందే ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. కొన్ని నెలలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హార్ట్‌ ఎటాక్‌తో మరిణించే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా కనిపించిన వారు ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండడం కలిచివేస్తోంది. నాలుగు రోజుల వ్యవథిలోనే తెలుగు రాస్ట్రాలకు చెందిన ఐదుగురు యువకులు చిన్నవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు వదలడం కలకలం రేపుతోంది. ఏ నిమిషం ఎవరి గుండె ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

నిర్మల్‌లో పెళ్లింట విషాదం… డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయి మృతి…

తాజాగా.. నిర్మల్‌ జిల్లాలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. వివాహ శుభకార్యంలో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు ప్రాణాలు వదిలాడు. జిల్లాలోని కుభీర్‌ మండలం పార్టీకే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెదిన కృష్ణయ్య కుమారుని వివాహం శుక్రవారం భైంసా మండలంలోని కామోల్‌ గ్రామంలో జరిగింది. శనివారం పార్డికేలో విందు నిర్వహించారు. వేడుకలో భాగంగా బరాత్‌లో పెళ్లి కుమారుని సమీప బందువు, మిత్రుడు ముత్యం (19) డ్యాన్స్‌ చేశాడు. డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటాహుటిన వైద్యం కోసం బైంసాఏరియా ఆసుపత్రికి తరలించగా ముత్యంఅప్పటికే మృ తిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామంగా బంధువులు చెబుతున్నారు.

ఆదోనిలో జిమ్‌ చేస్తూ… మృతి

అటు ఆదోనిలోనూ జిమ్‌ చేస్తూ సాయు ప్రభు అనే యువకుడు కుప్పకూలాడు. ఆదోని పట్టణ శివారు ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న జిమ్‌ వద్ద ఈఘటన జరిగింది. తిరుమల్‌నగర్‌కు చెందిన సాయి ప్రభు ప్రతీ రోజూ వ్యాయామం చేస్తుంటాడు. ఎప్పటిలానే వ్యాయామం చేసి జిమ్‌ బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పగికే ఆయన మృతిచెందాడు. సాయు ప్రభుకు ఇటీవలే వివాహం నిశ్చయం అయింది.

ఒత్తిడితో కూడిన ఆధునిక జీవన శైలే కారణం…

యువతలో గుండెపోటుకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆధునికజీవనంతో కూడిన పని ఒత్తిడి అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అతిగా వ్యాయామం చేసే దోరణి కూడా మంచిది కాదంటున్నారు. శారీరకవ్యాయామం చాలా ముఖ్యమే అయినప్పటికీ అది శారీరక పరిమితులకు లోబడి ఉండాలంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement