ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చే పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణను రూస్ అవెన్యూ కోర్టు జూలై 22కి వాయిదా వేసింది.
ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.