మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ ఎఫ్‌ఎస్‌ఐఆర్ ను కొట్టివేయాలని హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది చక్రధర్ గౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు హరీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.