Tuesday, November 26, 2024

Exclusive | స్మార్ట్​ వాచ్​తో హెల్త్​ ప్రాబ్లమ్స్​​.. తాజా అధ్య‌య‌నం ఏం చెబుతుందంటే!

ప్రస్తుతం స్మార్ట్‌వాచెస్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త ఫీచర్లు, డిజైన్‌లతో స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫిట్‌నెస్, హెల్త్ ట్రాక్ చేస్తూ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో స్మార్ట్‌వాచ్‌లు ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం యాపిల్ స్మార్ట్‌వాచ్ 100% యాక్యురసీతో టోటల్ బాడీని ట్రాక్ చేస్తూ మరింత ప్రయోజనాలను అందిస్తోంది.

అయితే ఈ యాపిల్ వాచ్ వల్ల కలిగే హెల్త్‌ బెనిఫిట్స్‌ మాట అటుంచితే, రోగాలు వస్తాయని తాజాగా ఒక స్టడీ బయటపెట్టింది. యాపిల్ రిస్ట్‌బ్యాండ్స్‌ వల్ల లేని రోగాలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉందని వెల్లడించింది. అలాగే ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్ తొడుక్కునే వారికి కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్టడీ పేర్కొంది.

వాచ్, ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్స్‌పై స్టెఫిలోకాకస్ ఎస్‌పీపీ, E. కోలి, సూడోమోనాస్ Spp అనే బ్యాక్టీరియా వచ్చి చేరుతుందని ఈ అధ్యయనం కనుగొన్నది. ఈ బ్యాక్టీరియా జ్వరం, విరేచనాలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ అధ్యయనాన్ని US-బేస్డ్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ (FAU) పరిశోధకులు చేపట్టారు. యాపిల్ వాచ్, ఫిట్‌బిట్ యూజర్లు వాటిని క్రమం తప్పకుండా సబ్బు, నీరు లేదా క్రిమిసంహారక కెమికల్స్‌తో శుభ్రం చేయాలని పరిశోధకులు సిఫార్సు చేశారు.

స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు రిస్ట్‌బ్యాండ్స్‌ను ధరించడం మానుకోవాలని వారు సూచించారు. సైన్స్ జర్నల్ ‘అడ్వాన్సెస్ ఇన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’లో ప్రచురించిన ఈ స్టడీ దాదాపు అన్ని యాపిల్ వాచీలు, ఫిట్‌బిట్స్‌ రిస్ట్‌బ్యాండ్స్‌ హానికరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటాయని వెల్లడించింది.

- Advertisement -

అధ్యయనంలో తేలింది ఏంటి?

ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీ పరిశోధకులు రిస్ట్‌బ్యాండ్స్‌పై బ్యాక్టీరియా బిల్డప్ గురించి తెలుసుకునేందుకు ప్లాస్టిక్, రబ్బరు, గుడ్డ, తోలు, మెటల్ (బంగారం, వెండి)తో తయారు చేసిన 100 రిస్ట్‌బ్యాండ్స్‌ను పరీక్షించారు. రబ్బరు, ప్లాస్టిక్ రిస్ట్‌బ్యాండ్స్‌లో బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువగా ఉందని, మెటల్ రిస్ట్‌బ్యాండ్స్‌పై బ్యాక్టీరియా అత్యల్పంగా ఉందని వారు కనుగొన్నారు. రబ్బరు, ప్లాస్టిక్ రిస్ట్‌బ్యాండ్‌ల పోరస్, స్టాటిక్ ఉపరితలాలు బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన స్థలంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

‘ప్లాస్టిక్, రబ్బరుతో చేసిన రిస్ట్‌బ్యాండ్స్‌లో మెటల్‌తో చేసిన వాటి కంటే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్, రబ్బరు వాటిలో పోరస్ (చిన్న రంధ్రాలు లేదా ఓపెనింగ్స్) స్థిరంగా ఉంటాయి, ఇది బ్యాక్టీరియా వృద్ధికి మంచి వాతావరణాన్ని అందిస్తుంది. మరోవైపు, మెటల్ రిస్ట్‌బ్యాండ్‌లు మృదువైనవి, పోరస్ లేనివి, ఇవి బ్యాక్టీరియాకు తక్కువ ఆతిథ్యం ఇస్తాయి.’ అని రీసెర్చర్లు అన్నారు.

95% రిస్ట్‌బ్యాండ్స్‌పై బ్యాక్టీరియా

వారి స్టడీలో 95% రిస్ట్‌బ్యాండ్స్‌ హానికరమైన బ్యాక్టీరియాతో కలుషితమై ఉన్నాయని తేలింది. రిస్ట్‌బ్యాండ్స్‌పై కనిపించే అత్యంత సాధారణ బ్యాక్టీరియా స్టెఫిలోకాకస్ (85%), ఇ. కోలి (60%), సూడోమోనాస్ (30%) అని పరిశోధకులు పేర్కొన్నారు. జిమ్‌కు వెళ్లేవారు ధరించే రిస్ట్‌బ్యాండ్స్‌లో స్టెఫిలోకాకస్‌ అనే బ్యాక్టీరియా చాలా అధికంగా ఉందని, ఇది సెప్సిస్ లేదా మరణానికి కూడా కారణమవుతుందని రీసెర్చర్లు వెల్లడించారు. హెల్త్ కేర్ వర్కర్స్ ముఖ్యంగా వీటిని శుభ్రపరచు కోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మహిళలు, మగవారు ధరించే రిస్ట్‌బ్యాండ్‌ల బ్యాక్టీరియా సంఖ్యలో పెద్దగా తేడా లేదని కూడా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement