Thursday, November 21, 2024

Health: వ్యాక్సిన్‌తో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లకు చెక్‌..

కొవిడ్‌ మహమ్మారి మూలంగా చాలామంది ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవ డం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత వంటి అంశాల మీద జాగ రూకతతో వ్యవహరించారు. మహమ్మారి తీవ్రత తగ్గినప్ప టికీ జాగ్రత్త చర్యలు కొనసాగించాల్సి వచ్చింది. కోవిడ్‌ కన్నా మునుపు ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్స్‌ (నిమోనియా) వంటివి అతిపెద్ద ప్రాణాం తక జబ్బులుగా ఉండేవి. పిల్లల్లో, పెద్దల్లో ఇటువంటి వ్యాధుల వల్ల 2.5 మిలియన్ల మంది చనిపోయా రు. వీరిలో 6 లక్షల 72వేల మంది పిల్లలు ఉన్నారు. కోవిడ్‌ వచ్చినతర్వాత మరో రెండు మిలియన్ల మంది చనిపోయారు. అంటే నాలుగు మిలియన్ల కంటే ఎక్కువమంది నేల కొరిగారు. ఏ ఇతర ఇన్‌ఫెక్షన్స్‌కి ఇంత పెద్ద మొత్తంలో చనిపోయిన ట్టు గణాంకాలు నమోదు కాలేదు. స్ట్రెఎn్టోకకస్‌ నిమోని అనే బ్యాక్టీరియా న్యుమో నియా రావడానికి అతిపెద్ద కారణ భూతం గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నిమోని యా వల్ల23 శాతం బాధపడుతుంటే ఒక్క మనదేశంలో 14 నుంచి 30 శాతం వరకు బాధపడుతున్నారు.

వయసు పైబడిన వారికి నిమోని యా సోకితే ప్రమాదకరం. 65 సంవత్సరా లు పైబడ్డ వారికి వైద్యపర మైన సమస్యలైన గుండె వ్యాధి, డయాబె టిస్‌, దీర్ఘకాలికంగా ఊపిరి తిత్తుల వ్యాధులు ఉన్నట్లయితే మరిం త జాగ్రత్తగా ఉండాల్సిందే.నిమోనియా అనేది అతి సాధారణ ఊపిరితిత్తుల వ్యాధి. ఫంగల్‌ ఇన్‌ఫెక్ష న్‌ వస్తే కూడా నిమోనియాకు దారితీస్తుంది. కొన్ని జాగ్ర త్తలు తీసుకుంటే ఊపిరితిత్తుల వ్యాధులనుంచి సురక్షితంగా బయ టపడొచ్చు. నిమోకోక్కల్‌ వ్యాధి వచ్చిన వారు నిర్ల క్ష్యంగా వ్యవహరించడం ప్రమాదకరం. కొన్ని వారాల పాటు మీ జీవి తంలో ఆటంకాలు వాటిల్లుతాయి. వీళ్లు ఆస్ప త్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లు తుంది. వయ సుపై బడిన వారికి ఇది ప్రమాదకరమే. నిమోకోక్కల్‌ బ్యాక్టీరి యా వ్యాప్తి ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. ముక్కు, గొంతు ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. స్మోకింగ్‌ వల్ల ఊపిరితిత్తుల కణజాలం బాగా దెబ్బతిన్న వారికి నిమోనియా ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఇలా చేస్తే మేలు..
ఆరోగ్యకరమైన వ్యక్తులు మూడు వారాల్లో నిమోనియా నుంచి కోలుకుంటారు. కాని కొన్ని ఆరోగ్య సూచనలు పాటించకపోతే మాత్రం ప్రాణాంతకమౌతుంది. వ్యాక్సిన్‌ తీసుకుంటే నిమోకొక్కల్‌ నిమోనియాను అధిగమించొచ్చు. నిమో కోక్కల్‌ వ్యాక్సిన్‌ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. డాక్టర్‌ సిఫా రసు మేరకు ఈ వ్యాక్సిన్‌ ఏ వయసు వారు అయినా తీసుకోవచ్చు. ఆరోగ్య కరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వెళితే మాస్క్‌ ధరించాలి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారితో సామాజిక దూరం పాటించాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరల్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

  • డాక్టర్‌ సొనాలి డిగ్గే. మెడికల్‌ డై రెక్టర్‌ ఫైజర్‌ లిమిటెడ్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement