ఢిల్లీ – : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వృద్దాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో.. ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని అత్యవసర సేవా విభాగానికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు
Advertisement
తాజా వార్తలు
Advertisement