Tuesday, November 26, 2024

సైక్లింగ్ చేయండి.. దీర్ఘాయువు సొంతం చేసుకోండి

వ్యాయామంలో సైక్లింగ్ ఎంతో కీలకమైనది. శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచే సైక్లింగ్‌తో దీర్ఘ‌కాలం ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చ‌ని తాజాగా ఓ సర్వే వెల్ల‌డించింది. బాల్యంలో ప్ర‌తిఒక్క‌రూ సైకిల్‌పైనే స్కూల్‌కు వెళ్ల‌డం, ఫ్రెండ్ ఇంటికి వెళ్ల‌డం వంటివి చేస్తుంటారు. ఏ వ‌య‌సులోనైనా సైకిల్ తొక్క‌డం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. సైక్లింగ్‌తో తీరైన శ‌రీరాకృతి ల‌భించ‌డంతో పాటు దీర్ఘాయువు కూడా సొంత‌మ‌వుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి.

ప్రతి మనిషి రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే గుండె జ‌బ్బుల ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని జ‌ర్న‌ల్ స‌ర్క్యులేష‌న్ వెల్లడించింది. సైక్లింగ్ గుండె కండ‌రాల‌పై ఒత్తిడి త‌గ్గించి ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌జావుగా సాగేందుకు ఉప‌క‌రిస్తుంద‌ని వెల్ల‌డించింది. నిరంత‌రం సైక్లింగ్ ద్వారా గుండె జ‌బ్బుల ముప్పు 15 శాతం తగ్గుతుంద‌ని, స్ట్రోక్‌, గుండె పోటు ముప్పును నివారిస్తుంద‌ని తెలిపింది. సైక్లింగ్‌తో స్ధూల‌కాయం ముప్పు త‌గ్గడంతో దీర్ఘ‌కాలంలో మధుమేహం రాకుండా నిరోధించ‌వ‌చ్చ‌ని సర్వే పేర్కొంది.

ఈ వార్త కూడా చదవండి: వీడియో: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్

Advertisement

తాజా వార్తలు

Advertisement