డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి తాజాగా రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి 85.50 మార్కును దాటడం ఇదే తొలిసారికాగా.. ఈ నెలలో భారీగా పడిపోయి 85.73కి చేరుకుంది.
నాన్-డెలివరేబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్‌లో డాలర్‌కు బలమైన డిమాండ్ కారణంగా ఇది వరుసగా తొమ్మిదో రోజు క్షీణతలో కొనసాగింది. ఈ ఏడాది ఇప్పటివరకు US డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 శాతం బలహీనపడింది. వరుసగా ఏడవ సంవత్సరం వార్షిక నష్టాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తోంది.