Tuesday, November 19, 2024

అత‌డు తండ్రి కాదు.. కామాంధుడు

రాయ్‌పూర్: క‌న్న‌బిడ్డ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన ఓ తండ్రి… క‌న్న కూతురుపైనే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడో ఓ కామాంధుడు. మూడు మాసాల‌పాటుగా కూతురుపై అత్యాచారం చేస్తున్నాడు. క‌ట్టుకున్న భార్య అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాలైంది. దీన్ని అదును భావించి… అభం శుభం తెలియ‌ని తొమ్మిదేళ్ల కుమార్తెను బెదిరించి, దాడి చేసి అత్యాచారం చేశాడు. అంత‌టితో ఆగ‌లేదు ఆ కీచ‌క తండ్రి… భార్య అనారోగ్యం నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన త‌ర్వాత కూడా ఆమె ఇంట్లో లేని స‌మ‌యంలో చూసి కూతురుపై దుర్మార్గానికి ఒడిగ‌డుతూ వ‌చ్చాడు.

పొరుగింటి మ‌హిళ ఓ సారి ఇంట్లో ఏవో అరుపులు వినిపిస్తున్నాయ‌ని గ‌మ‌నించింది. ఆ బాలిక ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆరా తీసింది. మీ నాన్న అఘాయిత్యం సంగ‌తి మీ అమ్మ‌కు చెప్పావా అని నిల‌దీసింది. లేద‌న్న‌ది. వాళ్ల అమ్మ ఇంటికొచ్చిన త‌ర్వాత కూతురు విష‌య‌మంతా చెప్పి బోరున ఏడ్చేసింది. కూతురును తీసుకుని నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కెళ్లి కామాంధుడైన భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ కీచ‌క తండ్రిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కోర్బా జిల్లా రాంపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చేటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement