Monday, November 25, 2024

లక్షకు 20వేలు… షేర్ మార్కెట్ పేరుతో కోట్లు కొట్టేసి జంప్

షేర్ మార్కెట్ పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టుకెళ్ళాడు ఓ వ్యక్తి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట కు చెందిన షేక్ సుభాని షేర్ మార్కెట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. రాత్రికి రాత్రే షాపు, ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. లక్షకు నెలకు ఇరవై వేలు ఇస్తాను అంటూ భారీగా డిపాజిట్లు సేకరించిన సుభాని సుమారు 100 కోట్లకు టోపీ పరారైనట్టు తెలుస్తుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి సుభాని కనిపించకపోవటంతో గుర్లపల్లి రోడ్డు లో సుభాని నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లగా ఇల్లు తాళం వేసి ఉంది. ఇక అది చూసిన బాధితులు లబోదిబోమంటన్నారు.

ఇక సుభాని మోసం చేసిన వారిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంత జరిగినా పోలీసులు మాత్రం ఈ విషయంపై కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement