ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన విజయాల పరంపరని కొనసాగిస్తొంది. ఇవ్వాల (గురువారం) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచలో.. టీమిండియా తన ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్తో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. 358 పరుగుల లక్షంతో చేజింగ్‌కు దిగిన శ్రీలంక పరుగుల సాధించడంలో అత్యంత దారునంగా విఫలమైంది.. దీంతో 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో.. జస్ప్రీత్ బుమ్రా 1, రవీంద్ర జడేజా 1, మహ్మద్ సిరాజ్ 3, మహ్మద్ షమీ 5 వికెట్లు సాధించి శ్రీలంక జట్టును మట్టికరిపించారు..
ఇక, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 358 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ (92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (88) కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్ (82) చివర్లో వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు పడగొట్టాడు.