Friday, November 22, 2024

33 ఏళ్ల అలుపెరగని పోరాటం – సక్సెస్ చూపిన కరోనా

కరోనా మహమ్మారి దేశంలో ఎంతోమందికి ఇబ్బందులకు గురి చేసింది. ఎంతోమంది పేద ప్రజలకు ఆకలి ఆర్తనాదాలను మిగిల్చింది. కానీ ఓ 51 ఏళ్ల వృద్ధుడికి మాత్రం తన 33 ఏళ్ల పోరాటానికి విజయం చేకూర్చింది. కరోనా విజయం చేకూర్చడం ఏంటి అనుకుంటున్నారా…!! అయితే ఈ విషయం పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

తెలంగాణకు చెందిన మహమ్మద్ నూరుద్దీన్ వయస్సు 51 సంవత్సరాలు. ఆయన 1987 నుంచి 10 వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సబ్జెక్టులన్నీ పాస్ అవుతున్నప్పటికీ.. ఇంగ్లీషులో మాత్రం వీక్ అవటంవల్ల ప్రతి ఏడాది కూడా ఆ పరీక్ష తప్పుతూనే ఉన్నాడు. 1987 నుంచి 2020 వరకు నూరుద్దీన్ ఇంగ్లీష్ పరీక్ష రాస్తూనే వచ్చాడు. ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు. ఇక ఎట్టకేలకు 2021లో నూరుద్దీన్ కల నెరవేరింది. అయితే ఈసారి పరీక్షలు రాయకుండానే ఆ కల నెరవేరింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నూరుద్దీన్ కలను నెరవేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement