తిరువనంతపురం: అతనో అధికార పార్టీ నాయకుడు… నియోజకవర్గ స్థాయి నేత… ఆమె ఆ పార్టీ సామాన్య కార్యకర్త. పార్టీ సమావేశాలకు తరుచూ హాజరయ్యేది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ నేపథ్యంలో ఆ నాయకుడు ఆమెపై కన్నుపడింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా కార్యకర్తకు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించాడు. మత్తులోకి జారాక ఆమెపై కారులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అంతటితో ఆ నాయకుడు ఆగలేదు. ఆ దృశ్యాలను చూపించి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే ఆ వీడియోలు బయటపెడతానంటూ బాధితురాలను బెదిరించాడు. కొంత డబ్బు చెల్లించింది. అయినా ఇంకా కావాలంటూ వేధింపులు ఎక్కువయ్యాయి. నా దగ్గర డబ్బులేదని, ఇవ్వలేని తేల్చి చెప్పింది. దీంతో సదరు నేత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడితోసహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.