ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని దహల్చోరి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన 18 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం పుష్కర్ సింగ్ దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.