Thursday, November 21, 2024

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త వడ్డీరేట్లు..

హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలపై వడ్డీరేట్లు సవరించింది. 2022 ఏప్రిల్‌ 6నుంచి కొత్త వడ్డీరేట్లు అమలులోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇకపై సేవింగ్స్‌ ఖాతాలపై 3శాతం వార్షిక వడ్డీరేటును అందించనుంది. రూ.50 లక్షలలోపు మొత్తాన్ని కలిగిన అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. ఈ లిమిట్‌ కన్నా ఎక్కువ డబ్బులు కలిగి ఉంటే అప్పుడు 3.5శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇదివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.50లక్షలలోపు బ్యాలెన్స్‌ కలిగిన అకౌంట్లకు 3 శాతం వడ్డీరేటును అందించేది. రూ.50 లక్షల నుంచి రూ.1000 కోట్ల మధ్యలో బ్యాలెన్స్‌ ఉన్న సేవింగ్స్‌ అకౌంట్లకు 3.5 శాతం వడ్డీ వచ్చేది.అలాగే రూ.1000 కోట్లకుపైన అమౌంట్‌ ఉన్న ఖాతాలపై 4.5శాతం వడ్డీని ఆఫర్‌ చేసేది. అయితే ఇప్పుడు రూ.50లక్షలకు పైన అమౌంట్‌ ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది. డొమెస్టిక్‌, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ డిపాజిట్లు సహా అన్ని సేవింగ్స్‌ ఖాతాలకు ఇదే వడ్డీరేట్లు వర్తిస్తాయి.మీ బ్యాంక్‌ అకౌంట్‌లోని డెయిలీ బ్యాలెన్స్‌ ఆధారంగా వడ్డీ మొత్తాన్ని లెక్కిస్తారు. బ్యాంక్‌ ఈ వడ్డీ డబ్బులను మూడునెలలకు ఒకసారి చెల్లిస్తూ వస్తుంది. బ్యాంక్‌ మరోవైపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయంతీసుకున్న విషయం విషయం తెలిసిందే. బ్యాంక్‌ రూ. 2కోట్లకులోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. ఏడాదినుంచి రెండేళ్లలోపు కాలపరిమితిలోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది.గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ డిపాజిట్లపై 5శాతం వడ్డీ రేటును అందించేది.

అయితే ఇకపై ఈ ఎఫ్‌డీలపై 5.1శాతం వడ్డీ వస్తుంది. మరోవైపు ప్రభుత్వరంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మాత్రం వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఈ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటును 2.75శాతం నుంచి 2.7శాతానికి తగ్గించేసింది. రూ.10లక్షలలోపు బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాలకు ఇది వర్తిస్తుంది. అలాగే ఈ లిమిట్‌కు పైన బ్యాలెన్స్‌ కలిగిన ఖాతాలపై కూడా వడ్డీరేటు తగ్గింది. 2.8శాతం నుంచి 2.75శాతానికి క్షీణించింది. వడ్డీరేట్ల తగ్గింపు వల్ల బ్యాంక్‌ ఖాతాదారులకు ఇదివరకటి కన్నా తక్కువ రాబడి వస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement