రూ. 2 కోట్లకు లోబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రయివేటు దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు 18 ఆగస్టు నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం సాధారణ ప్రజలకు 2.75 శాతం నుంచి 5.7 శాతం వరకు, సీనియర్ సిటిజన్స్‌కు 3.2 శాతం నుంచి 6.5 శాతం వరకు కాలపరిమితి కలిగిన (7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను అందిస్తోంది. 7-29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పటికీ 2.75శాతం వడ్డీ రేటును ఇస్తున్నది. 30-89 రోజుల టర్మ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నది.
90-180 రోజుల మధ్య ఎఫ్‌డీలకు 3.75 శాతం చెల్లిస్తున్నది. అయితే, ఆరు నెలల నుంచి ఏడాది లోపు మెచ్యూరిటీ ఎఫ్‌డీలపై 4.65 శాతం వడ్డీరేటు ను కొనసాగిస్తున్నది. ఏడాదిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల పెంచింది. అదే సమయంలో 5-10 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీలకు చెల్లించే వడ్డీ రేటు మాత్రం (5.75 శాతం ) స్థిరంగా కొనసాగుతున్నది. 3-5 ఏళ్ల మధ్య మెచ్యూరయ్యే ఎఫ్‌డీలకు సాధారణ ప్రజలకు 6.1శాతం , సీనియర్ సిటిజన్లకు 6.6 శాతం గరిష్టంగా వడ్డీరేటును అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్ బ్యాంక్ వెస్‌బైట్ వెల్లడిస్తున్నది.