Sunday, November 17, 2024

హెడీఎఫ్‌సీ బ్యాంకు, రుణం మరింత ప్రియం.. వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకు

ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో.. బ్యాంకులు కూడా తమ ఖాతాదారులపై వడ్డీ భారాన్ని మోపేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా శనివారం హెచ్‌డీఎఫ్‌సీ కూడా వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. 30 బేసిస్‌ పాయింట్లు (0.30 శాతం) వడ్డీ పెంచుతున్నట్టు వెల్లడించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ రుణం తీసుకున్న వారిపై మరింత ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నాయి. రుణ గ్రహీతల ఈఎంఐల నెలలు పెరగనున్నాయి. గృహ రుణాలపై రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (ఆర్‌పీఎల్‌ఆర్‌) 9వ తేదీ నుంచి 30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

కొత్త రుణ గ్రహీతలకు అందించే రుణ రేట్లను మాత్రం యథావిధిగా 6.70 శాతం నుంచి 7.15 శాతం మధ్యే ఉంచుతున్నట్టు వివరించింది. అయితే క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా.. రుణాలు ఇస్తారు. దానిపై వడ్డీ కూడా అదే రీతిలో నిర్ణయిస్తారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. క్రెడిట్‌ స్కోర్‌ 750పైన ఉంటే.. రూ.30లక్షల వరకు రుణం తీసుకుంటే.. 7.10 శాతం, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య రుణం తీసుకుంటే.. 7.35 శాతం, రూ.75లక్షలు.. ఆపైన రుణం తీసుకుంటే.. 7.45 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రుణ గ్రహితలు మహిళలు అయితే.. వారికి 0.05 శాతం వడ్డీ తక్కువగా ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement