Monday, November 18, 2024

ఇక వాట్సాప్ లోనూ HD క్వాలిటీ ఫోటోలు, వీడియోలు షేరింగ్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న వినియోగ‌దాలుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌ ఫీచర్లను అందిస్తోంది. అలానే.. రీసెంట్‌గానే వీడియో మెసేజెస్ తీసుకొచ్చింది. ఇక‌, తాజాగా మరొక ముఖ్యమైన అప్‌డేట్ రిలీజ్ చేసింది వాట్సాప్. వాట్సాప్ లో ఫోటోలు HD క్వాలిటీ షేర్ చేయాలి అంటే కాస్త క‌ష్ట‌మైన ప‌నే.. దీంతో యూజ‌ర్లు ఫోటోల‌ని డాక్యుమెంట్స్‌గా పంపించాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే HD ఆప్షన్ ఆఫర్ చేస్తున్నాయి. కాగా, ఆండ్రాయిడ్, iOS, వెబ్ వెర్షన్లు వాడుతున్న వాట్సాప్ యూజర్లు HD క్వాలిటీ ఫొటోలు పంపించుకునేలా HD ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది మెటా.

ఈ స్పెసిఫికేషన్ ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ క్రమంగా విడుదలవుతుంది. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకొని, HD ఇమేజ్ ఆప్షన్ యాక్సెస్ చేయవచ్చు. ఇది ఇంకా అందుబాటులోకి రాని యూజర్లు కొద్ది వారాల పాటు వేచి చూడాలి. ఈ టేటెస్ట్ ఫీచ‌ర్ ద్వారా వాట్సాప్‌లో ఒక ఫొటో పంపించేటప్పుడు సెండింగ్ స్క్రీన్‌లో “పెన్, క్రాప్ టూల్స్” పక్కన టాప్ సైడ్‌లో “HD” ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. HD క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సెండ్ బటన్‌పై క్లిక్ చేయాలి.

వాట్సాప్‌లో ఫొటోలు బై డిఫాల్ట్‌గా స్టాండర్డ్ క్వాలిటీలో సెండ్ అవుతాయి. ఫాస్ట్‌గా, తక్కువ డేటాతో ఫోటోస్ పంపించుకునేలా వాట్సాప్ ప్రోత్సహిస్తుంది. ఒకవేళ HD అక్కర్లేదు అనుకుంటే ఎలాంటి ఆప్షన్ ఎంచుకోకుండా నేరుగా పంపించవచ్చు.

HD వీడియో ఆప్షన్

- Advertisement -

వాట్సాప్‌లో HD వీడియోలు షేర్ చేసే ఫీచర్ కూడా త్వరలో రానుందని మెటా తెలిపింది. అప్పుడు యూజర్లు HD క్వాలిటీతో వీడియోలు సెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పంపించే వీడియోలు చాలా కంప్రెస్ అయ్యి తక్కువ క్వాలిటీతో రిసీవర్‌కు చేరుతున్నాయి. దీనివల్ల వినియోగదారులు వీడియో ఫైల్స్ డాక్యుమెంట్స్‌గా పంపించాల్సిన పరిస్థితి వస్తోంది. త్వరలో ఈ ఇబ్బంది కూడా తొలగిపోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement