Friday, November 22, 2024

జనవరి 10న హెచ్‌సీఏ ఎన్నికలు.. సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం

హెదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మళ్లి గొడవలు ప్రారంభమయ్యాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 26వ తేదీకే ముగిసిందని మాజీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని మండి పడ్డారు. అందులో భాగంగానే ఆదివారం హెచ్‌సిఏ మాజీ సభ్యులంతా కలిసి ఉప్పల్‌ స్టేడియంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 160 మంది సభ్యులు హాజరయ్యారు.. జనవరి 10న ఎన్నికలు జరుపుతామని హెచ్‌సీఏ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జి. సంపత్‌ను ఎన్నికల అధికారిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పదవీకాలం ముగిసినా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్‌ మండిపడ్డారు. కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారాయన. క్రికెట్‌ క్లబ్‌ల కార్యదర్శులు ఎన్నికల అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. హెచ్‌సీఏ సభ్యులు సమావేశం పెట్టకుండా స్టేడియం బయటే అడ్డుకున్నారని ఆరోపించారు. మాజీ సెక్రెటరీ శేషు నారాయణ జనరల్‌ బాడీలోపల సమావేశం పెట్టుకోవడానికి అనుమతించలేదని మండి పడ్డారు.

హెచ్‌సీఏ మెంబర్స్‌ను అజర్‌ అండ్‌ టీమ్‌ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇటీవలె టికెట్‌ స్కామ్‌ విషయంలో అజారుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌సీఏలో కొనసాగుతున్న వివాదంపై అజారుద్దీన్‌ మళ్లిd ఇప్పటి వరకు స్పందించలేదు. అజారుద్దీన్‌ రాజీనామా చేస్తారా? ఎన్నికలు జరుగుతాయా? అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement