దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతర్జాతీయ వేదికలపై సత్తాని చాటింది. హెచ్ సి ఏ అవార్డుల్లో బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసి ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, హెచ్సీఏ స్పాట్ లైట్ (విదేశాల్లో సైతం విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం) అవార్డులను సొంతం చేసుకుని మన తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకూ చాటింది. ఈ చిత్రంలో స్టార్ హీరోస్ ఎన్టీఆర్..రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement