Friday, September 6, 2024

HBD – కేటీఆర్ కు రేవంత్ బర్త్ డే విషెస్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్: గులాబీ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఈ కోరారు రేవంత్ రెడ్డి.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. 47వ వసంతంలోకి కేటీఆర్ అడుగుపెడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు… గులాబీ నేతలు రంగం సిద్ధం చేశారు.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement