వెలగపూడి – ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఢీ అంటే ఢీ అంటూ నిత్యం రాజకీయ విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్న సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు , మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై తమ రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్‌కు చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.
మరోవైపు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ధీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. కాగా, జగన్ బర్త్‌డే వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. అభిమానులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.