Thursday, November 21, 2024

భారత్‌ సిరీస్‌ నుంచి హేజిల్‌ వుడ్‌ దూరం

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఆస్ట్రేలియాకు మరో షాక్‌ తగిలింది. మిగతా రెండు టెస్టులకు కూడా స్టార్‌ పేసర్‌ హేజిల్‌వుడ్‌ దూరం కానున్నాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడలేదు. సిడ్నీ టెస్టులో అయిన గాయం నుంచి హేజిల్‌ వుడ్‌ ఇంకా కోలుకోలేదు. దాంతో అతను స్వదేశానికి వెళ్లనున్నాడు. అతనితో పాటు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, అష్టన్‌ అగర్‌, మ్యాట్‌ రెన్‌షా కూడా బయలు దేరనున్నట్లు సిడ్నీ హెరాల్డ్‌ వార్తా సంస్థ తెలిపింది. రెండో టెస్ట్‌లో డేవిడ్‌ వార్నర్‌కు బంతి బలంగా తాకడంతో అతను మైదానం వీడాడు. అతని ప్లేస్‌లో ట్రావిస్‌ హెడ్‌ ఆడాడు.

గాయం కారణంగా తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన ఆల్‌ రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌, ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్క్వార్ట్‌ ఇండోర్‌ టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే టెస్ట్‌ జట్టులో మార్పుల గురించి ఆసిస్‌ మేనేజ్‌మెంట్‌ బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ఈ ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు దిశగా ముందడుగు వేసింది. ఇండోర్‌, అహ్మదాబాద్‌ టెస్టుల్లో ఏదో ఒకటి గెలిచినా కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లోని ఓవల్‌ స్టేడియంలో డబ్ల్యూటీసీ టైటిల్‌ పోరు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement