Thursday, November 21, 2024

ఆటో గేర్‌ కార్లతో హవా.. మారుతీ సుజుకీ అంచనా

నగరాల్లో విపరీతంగా రద్దీ పెరుగుతున్నందున రానున్న రోజుల్లో ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఏజీఎస్‌) మోడల్‌ కార్లకే డిమాండ్‌ ఎక్కువ ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. వచ్చే సంవత్సరం ఉంచి ఈ కార్ల అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేసింది. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో మారుతీ సుజుకీ తొలిసారి సెలెరియాెె కారు మోడల్‌లో ఏజీఎస్‌ ను ప్రవేశపెట్టింది. తరువాత ఇతర మోడల్స్‌లోనూ దీన్ని ప్రమేశపెట్టింది. ఈ విధానంలో ప్రత్యేకంగా క్లచ్‌ నొక్కి బ్రేక్‌ వేయాల్సిన పనిలేదు. అవసరాన్ని బట్టి గేర్‌ మారుతుంది. మారుతీ సుజుకీ ఇప్పటి వరకు 7.74 లక్షల కార్లను విక్రయించింది.

ఏజీఎస్‌ ప్రవేశపెట్టిన తరువాత క్రమంగా దీన్ని ఈర మోడళ్లకు విస్తరించామని మారుతీసుజుకీ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ హెడ్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. పట్టణాల్లో రద్దీ పెరుగుతున్న కొద్దీ డ్రైవింగ్‌ మరింత సులభం అయ్యేందుకు ఇది తోడ్పుతుం దన్నారు. వచ్చే ఏడాది ఈ ఫీచర్‌ ఉన్న కార్ల విక్రయాలు మరింత పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం మారుతీ సుజుకీ సెలెరియో, ఆల్టోకె10, వేగనార్‌, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, బెజ్రా, ఎస్‌ ప్రెసో, బాలెనో వంటి మొత్తం 9 మోడల్స్‌లో ఏజీఎస్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మారుతీ కార్ల విక్రయాల్లో మోడల్‌ను బట్టి 12-23 శాతం వరకు ఏజీఎస్‌ యూనిట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఫీచర్‌ ఉన్న సెలెరియో కారు అత్యధికంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలు జరిపింది. వేగనార్‌ 1.39 లక్షలు, స్విఫ్ట్‌ 1.24 లక్షలు, డిజైర్‌ 1.01 లక్షలు, ఆల్టో కే 10 68 వేలు, ఇగ్నిస్‌ 49 వేలు, బ్రెజా 39 వేలు, బాలెనో 20 వేల యూనిట్లు విక్రయించింది. కార్లలో ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉండడం వల్లే డిమాండ్‌ పెరుగుతున్నదని శ్రీవాస్తవ చెప్పారు. ఎంట్రీ లెవల్‌లో సాధారణ ట్రాన్స్‌మిషన్‌, ఏజీఎస్‌ మధ్య తేడా 50వేలు మాత్రమే ఉందన్నారు.

- Advertisement -

మారుతీ తో పాటు ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధికంగా అమ్మకాలు జరుపుతున్న అన్ని కంపెనీల మోడల్స్‌లోనూ ఏజీఎస్‌ ఫీచర్‌ ఉంటున్నది. ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన కియా కార్లలో ఎక్కువ మోడళ్లలో ఈ ఫీచర్‌వే మార్కెట్‌లో ఉన్నాయి. హుండ్యాయ్‌, టాటా మోటార్స్‌, మహేంద్రా అండ్‌ మహీంద్రా వంటి కంపెనీలు తమ కొత్త మోడళ్లలో తప్పనిసరిగా ఈ ఫీచర్‌ ఉన్న వాటిని కూడా విక్రయిస్తున్నాయి. కస్టమర్ల ఎంపిక మేర కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ ఫీచర్‌ ఉన్న కార్లనే కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారని ఆటో మొబైల్‌ రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement