ప్రభన్యూస్ : ఔను రెండు తలల పామును చూసే ఉంటారు. కానీ రెండు తలల బల్లిని చూడటం అరుదు. ఇలాంటి అరుదైన సరీసృపాలను సంరక్షించి ప్రజలకు పరిచయం చేసే అలవాటున్న అమెరికాకు చెందిన జే బ్రోవర్ ఇప్పుడు ఓ అరుదైన బల్లిని గుర్తించాడు. దాని పోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. కాలిఫోర్నియాలో జే ఓ సరీసృపాల జూను నిర్వహిస్తున్నాడు. తరచూ అందులోని పాములు, ఇతర రెప్టైల్ జాతికి చెందిన జంతువుల ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేస్తూంటాడు.
సాధారణంగా వీటిలో అతిపెద్దవి, ప్రమాదకరమైన వాటి గురించి చెబుతూంటాడు. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు పాముకాట్లబారిన పడ్డాడు. అయితే ఎప్పుడూ ప్రాణాలకు ముప్పు రాలేదు. అయితే ఈసారి భిన్నంగా మరుగుజ్జు బల్లిని పరిచయం చేశాడు. నీలిరంగు నాలికతో, కేవలం చేతి బొటనవేలంత ఉన్న రెండు తలల బల్లి (నలిగెళ్ల పాము)జాతికి చెందిన జీవి ఇది. ఇన్ స్టాలో దాని ఫోటోలు చూసినవారు ఫిదా అయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital