Friday, November 22, 2024

విద్వేషం దేశాన్ని బలహీనపరుస్తోంది: రాహుల్‌ గాంధీ..

శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. విద్వేషం, హింస భారత దేశాన్ని బలహీనపరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యంతో కూడిన పునాదులు పురోగతికి మార్గం వేస్తాయి. భిన్నసంస్కృతి, సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు కలిసి నిలబడాలి’ అంటూ రాహుల్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ లోని ఖార్గోన్‌ నగరంలో అల్లర్లు చెలరేగాయి.

ఈ ఘటనలో పోలీసులు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. గుజరాత్‌లోని రెండు నగరాల్లో ఘర్షణలు చెలరేగడంతో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా హింసాత్మక కేసులు చోటుచేసుకున్నాయి. మరొకవైపు జేఎన్‌యూలోనూ ఘర్షణలు చెలరేగడంతో అక్కడ ఉద్రక్త వాతావరణం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement