కాంగ్రెస్ అభ్యర్ధిగా స్టార్ రెజ్లర్ గెలుపు
బిజెపి అభ్యర్ధిపై ఆరు వేల మెజార్టీతో సీటు కైవసం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై వినేష్ గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. ఒకానొక సమయంలో వినేష్ ఫొగాట్ వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ పుంజుకుని లీడింగ్‌లోకి వచ్చారు. ఆరు వేల పైచిలుకు ఓట్లతో యోగేష్‌పై రెజ్లర్ విజయం సాధించారు.