హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శనివారం సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధభూమిలో తన విశ్వరూపాన్ని ధరించి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న విరాట్ మూర్తిరూపాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఇటీవలే హరియాణాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం నిర్వహించినట్లు రాష్ట్రపతికి వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement