హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలకు అక్రమాస్తుల కేసులో ఈరోజు ఢిల్లీకి చెందిన సీబీఐ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ఆయనకు రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. 1993 నుంచి 2006 మధ్య ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్న కేసులో చౌతాలాను విచారించారు. మాజీ సీఎం చౌతాలాకు చెందిన నాలుగు ప్రాపర్టీలను కూడా సీజ్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. విచారణ సందర్భంగా కోర్టురూమ్‌కు ప్రత్యక్షంగా చౌతాలా హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో స్పెషల్ జడ్జి వికాశ్ దుల్ గత వారమే తీర్పునిస్తూ చౌతాలాను దోషిగా తేల్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement