పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతీ పాల్.. ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకల్లో భారత్ పతక పతకధారులుగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ‘చెఫ్ ది మిషన్’ అధికారి సత్య ప్రకాష్ సంగ్వాన్ వెల్లడించారు.
పారాలింపిక్స్ ఆర్చరీలో హర్విందర్ స్వర్ణంతో చరిత్ర సృష్టించగా, అథ్లెటిక్స్‌లో ప్రీతీ పాల్ రెండు కాంస్య పతకాలతో మెరిసింది. భారత్ ఖ్యాతిని పెంచిన ఈ ఇద్దరూ సెప్టెంబర్ 8న (ఆదివారం) జరిగే ముగింపు వేడుకలో భారత జట్టుకు ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించనున్నారు.