మహిళల భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల నిషేధంలో ఉన్నారు.. బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ మ్యాచ్ లో ఆమె అంపైర్.. బంగ్లాదేశ్ జట్టుతో వేధింపులను ఎదుర్కొన్నారు. హర్మన్‌ప్రీత్‌పై కఠిన చర్యలు తీసుకున్న ఐసీసీ రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం విధించింది.
దీంతో, ఆమె రాబోయే ఆసియా గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్, సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఆడలేరు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్పందించారు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో సహనం కోల్పోయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని హర్మన్‌ప్రీత్ తెలిపింది..
ఢాకాలో, అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత హర్మన్‌ప్రీత్ బ్యాట్‌తో స్టంప్స్ ని కొట్టింది. అనంతరం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లో అంపైరింగ్ దారుణంగా ఉందని చెప్పింది. ప్రెజెంటేషన్ వేడుకలో బంగ్లాదేశ్ జట్టుతో కూడా అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌పై ఐసీసీ నిషేధం విధించింది. ఉమెన్స్ ‘ది హండ్రెడ్’ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. నేను దేనికీ పశ్చాత్తాపం చెందడం లేదని.. ఎందుకంటే ఒక ప్లేయర్ గా తమ భావాలను వ్యక్తీకరించడానికి, అనిపించేదాన్ని చెప్పే హక్కు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పింది.