హార్లే-డేవిడ్‌సన్ ఇండియా తమ కంపెనీ నుంచి అత్యంత సరసమైన మోటార్‌సైకిల్, X400ని ఈ నెల (జూలై) 3న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ Hero MotoCorp భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. కాగా, ఈ సరి కొత్త మోటర్ బైక్ దేశంలోని హోండా H’ness CB350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి వాటికి పోటీగా నిలవనుంది.
కంపెనీ ఇప్పటికే ఈ మోటార్‌సైకిల్ ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. వాటి ఆధారంగా చూస్తే.. స్టైలింగ్, ఇంటిగ్రేటెడ్ హార్లే-డేవిడ్‌సన్ బ్రాండింగ్‌తో రౌండ్ హెడ్‌లైట్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్, మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, రెట్రో-స్టైల్ రౌండ్ ఇండికేటర్‌లను కలిగి ఉంది ఈ బైక్.
అయితే, మెకానికల్ స్పెసిఫికేషన్‌ల వివరాలు ప్రస్తుతానికి ఇంకా వెల్లడికాలేదు. అయితే టెక్ పరిశ్రమల సమాచారం మేరకు.. ఈ మోటార్‌సైకిల్ 440cc, సింగిల్ సిలిండర్, ఆయిల్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో 8,000rpm వద్ద రెడ్‌లైన్‌తో వస్తుందని తెలుస్తోంది. కొత్త X440లోని హార్డ్‌వేర్‌లో ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్‌లు, రెండు టైర్ లకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. పేఫ్టీ విషయంలో డ్యూయల్-ఛానల్ ABS, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది.