అమెరికాకు చెందిన ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్త హార్లే డేవిడ్సన్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ తీసుకురానుంది. లైవ్‌వైర్ బ్రాండ్ కింద మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌ను ఎస్2డెల్ మార్‌గా పేరు పెట్టింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మిడిల్ వెయిట్ విభాగంలోకి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో బ్యాటరీ, ఇన్వర్టర్, ఛార్జర్, స్పీడ్ కంట్రోలర్, మోటారు వంటి ఈ బైక్‌లో ఉన్నాయి.
ఈ బైక్ యారో ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో రానుంది. యారో ఆర్కిటెక్చర్ ద్వారా 21,700 రకాల సిలిండ్రికల్ సెల్ ్సతో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్ బైక్ కోసం హార్లే డేవిడ్సన్ ఉపయోగిస్తున్నది. ఈ ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. హార్లే డేవిడ్సన్ లైవ్‌వైర్ తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ కైమ్కోతో జతకట్టింది. ఏప్రిల్-జూన్ మధ్యలో విడుదల చేసే అవకాశాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..