Thursday, September 19, 2024

TG | తోపులాట‌లో హ‌రీష్ రావు చేతికి గాయం..

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసు వాహనాల్లో ఎక్కిస్తున్న క్రమంలో హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తున్నది.

అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో వాహనాన్ని తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. కాగా, బీఆర్‌ఎస్‌ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేశారని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనకు దిగగా, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement