Tuesday, November 26, 2024

అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు – రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ రూపకల్పన

హైద‌రాబాద్ – అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు.. అలాగే మండ‌లిలో మంత్రి ప్ర‌శాంత‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. అంత‌కు ముందు హ‌రీష్ రావు బడ్జెట్ ప్రతులతో జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు . బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకున్న‌ సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాదభివందనం చేసి ఆశిస్సులు తీసుకున్నారు.అనంత‌రం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు.

రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ 2,90,396 కోట్లు.

రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు

పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement