తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని నుండి త్వరగా కోలుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కోసం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ఆరోగ్యం కోసం పూజలు చేశారు. శ్రీరామనవమి సందర్శంగా సిద్దిపేటలో రామాలయంకు వెళ్లిన హరీశ్ … సీఎం కేసీఆర్ కరోనా నుండి కోలుకోవాలని , సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఈ ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరుగుతందన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది కేవలం అర్చకులు మాత్రమే ఈ వేడుకలను నిర్వహించారని, భక్తులను అనుమతించలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ కు అన్ని దేవుళ్లు ఆశీర్వాదాలు ఉండాలన్నారు. రాష్ర్ట ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ త్వరగా కోలుకొని పరిపాలనా కొనసాగించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.