Sunday, November 24, 2024

హుజురాబాద్ లో రైతు బంధు, రైతు ద్రోహులకు మధ్య పోటీ: హరీష్ రావు

హుజురాబాద్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేంధర్ కేసీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మంత్రి హరీష్ రావు ఈటలకు కౌంటర్ ఇచ్చారు. రైతు బంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ అని తాను అంటున్నానని తెలిపారు హరీష్ రావు. హుజురాబాద్ కు డబుల్ దమాకా అని… గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇక హుజురాబాద్ కు డోక లేదని మంత్రి హరీష్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపికి మధ్యే పోటీ ఉంటుందన్నారు.

మార్కెట్ యార్డులు రద్దు, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచడం బీజేపీ పార్టీ పని అని… రైతుల పై రబ్బర్ బుల్లెట్లు, బాష్ప వాయువులతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని… అందరు మంత్రులు వారి నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి లబ్ధి దారులను ఇళ్లల్లోకి పంపారని గుర్తు చేశారు. కానీ గడిచిన ఏడేళ్లలో ఒక్క ఇల్లు కట్టని ఈటెల రాజేందర్ ను గెలిపించడం అవసరమా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ గెలిచి ఒక లక్ష రూపాయల పని చేశాడా అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. రాజకీయ ముగింపు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement