Monday, September 23, 2024

TG | సీఎల్పీ భేటీకి అరికె పూడి.. బుకాయింపులు ఆపాలన్న హరీష్‌

హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హాజరయ్యారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు ఆరోపించారు. సీఎల్పీ భేటీకి గాంధీ హాజరవుతున్న వీడియో ఫుటేజీని ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

సీఎల్పీ సమావేశానికి అరెకెపూడి గాంధీ హాజరయ్యారు. ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు చాలిస్తారా.! అంటూ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబును హరీష్‌ రావు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement