Monday, January 27, 2025

TG | పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్షం చేసిందెవరు.. రేవంత్ కు హరీశ్ రావు సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్‌ విసిరారు. ‘‘మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది నిజమో.. కాదో తెలుసుకొనేందుకు తడి బట్టలతో పాలమూరు కురుమూర్తి స్వామి గుడికి పోదాం వస్తావా? అని ఛాలెంజ్ చేశారు. ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దాం?, నేను రెడీ, నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి ? సవాల్ విసిరారు.

రేవంత్ మాటల్లో నిజాయితీ లేదని అన్నారు. మహబూబ్ నగర్ కు అన్యాయం చేసింది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే అని ఆరోపించారు.

పదేళ్ల టీడీపీ పాలనలో, మరో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో… కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పెండింగ్ లో ఉంచి కేవలం 26 వేల ఎకరాలకే సాగునీరందించారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 6 లక్షల ఎకరాలకు పైగా నీరు ఇచ్చామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. పల్లె ప్రగతి, పట్టణ బంద్ అయ్యిందని అన్నారు. కడంగలో ప్రశ్నించినందుకు రైతులకు బేడీలు వేయించారు మండిపడ్డారు.

- Advertisement -

నవంబర్ 30 నాడు మహబూబ్‌నగర్‌లో రేవంత్ రూ.2750 కోట్లకు రుణమాఫీ చెక్కు ఇస్తే ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదు… ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకి విలువ లేదా? రేవంత్ ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే సీఎం కుర్చీకి విలువ లేనట్లే అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి వచ్చినంక దరఖాస్తులే.. దరఖాస్తులు. ఏడాది కిందట ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు మొదలుపెట్టారు.. ఆ తర్వాత కులగణన దరఖాస్తులు అన్నారు.. ఇప్పుడు గ్రామసభల్లో కూడా దరఖాస్తులు పెట్టించిండు. ఏది చేసిన అప్లై.. అప్లై.. తప్ప నో రిప్లై అన్నట్లుగా అయిపోయిందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఆనాడు కేసీఆర్ హయాంలో ఏ దరఖాస్తులు లేకుండానే సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. 11 విడతల్లో రూ.73 వేల కోట్ల నగదును కేసీఆర్.. రైతు బంధు పథకం కింద అందజేశారన్నారు. 13 లక్షల మందికి రూ.లక్ష చొప్పున కళ్యాణ లక్ష్మీ ఇచ్చామని చెప్పారు. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని గుర్తు చేశారు. ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చాత కాదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement