Tuesday, January 14, 2025

TG | కౌశిక్ రెడ్డి అరెస్ట్… డీజీపీకి హరీశ్ రావు ఫోన్ !

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ చేశారు. అరెస్ట్ చేసే కేసు కాకపోయినా.. పండుగ సమయంలో ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసు పెట్టడం తగదని, పోలీసులు కక్షసాధింపు చర్యలకు సహకరించవద్దని సూచించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement