Tuesday, November 26, 2024

Harish Effect – మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లిపై వేటుకి రంగం సిద్ధం ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై భారాస వేటుకు రంగం సిద్ధమైంది. మంత్రి హరీష్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించింది. అధినేత కేసీఆర్‌ సైతం ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. పార్టీలో పని చేయాలంటే పార్టీ లైన్‌లో ఉండాలనే హెచ్చరికలు సైతం ఇచ్చారు. జాబితా ప్రకటన సమయంలో టికెట్‌ ప్రకటించినా ఇదే ఫైనల్‌ కాదని కూడా స్పష్టం చేశారు. ఇష్టం ఉంటే పోటీ చేయొచ్చు.. లేదంటే వెళ్లిపోవచ్చనే సంకేతాలను ఇచ్చారు. మరోవైపు మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత సైతం మైనంపల్లి విమర్శలపై స్పందించారు. మంత్రి హరీష్‌ రావు తెలంగాణ కోసం, పార్టీ గెలుపుకు కృషి చేసిన విధానం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. హరీష్‌రావుకు అండగా నిలుస్తూ ట్వీట్‌ చేశారు. ఇది ఇలా ఉండగా నేడు మధ్యాహ్నం మైనంపల్లికి భారాస షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ లైన్‌లోకి వస్తే తప్ప మైనంపల్లికి మరో ఆప్షన్‌ లేదని గులాబీ వర్గాలు వెల్లడిస్తున్నారు. షోకాజ్‌ నోటీసుల అనంతరం మైనంపల్లి వివరణ తర్వాత వేటు తప్పదని హెచ్చరిస్తున్నాయి.

హరీష్‌ రావు టార్గెట్‌గా విమర్శలు
మల్కాజ్‌గిరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భారాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనతో పాటు తనయుడి టికెట్‌ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి ఘాటు- వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. మెదక్‌లో హరీశ్‌రావు నియంతగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన గతం గుర్తుంచుకోవాలన్నారు. సిద్దిపేట మాదిరిగా హరీశ్‌రావు మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. హరీశ్‌రావు మెదక్‌ జిల్లా అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడిని మెదక్‌ ఎమ్మెల్యే చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈసారి తన కుమారుడి కోసం మెదక్‌పై దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు. వచ్చేసారి సిద్దిపేటలో పోటీ- చేసి హరీశ్‌రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని ఘాటు-గా స్పందించారు.

ఈ ఎన్నికల్లో మెదక్‌, మల్కాజిగిరి టిక్కెట్లు- ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ- చేసానంటూ వెల్లడించారు. ఇద్దరికి టికెట్‌ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ- చేస్తామని ప్రకటించారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు అనంతరం అక్కడే బీఆర్‌ఎస్‌ టికెట్ల గురించి ప్రస్తావించారు. మైనంపల్లికి మల్కాజిగిరి.. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్‌ నుంచి టికెట్లు- ఆశించారు. హన్మంతరావుకు టికెట్‌ దక్కింది కానీ.. కుమారుడికి మెదక్‌ టికెట్‌ దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన పద్మా దేవేందర్‌ రెడ్డికి మళ్లీ టికెట్‌ కేటాయించారు. టికెట్ల ప్రకటన సందర్భంలో పోటీ- చేయడం, చేయకపోవడం అనేది మైనంపల్లి ఇష్టమని కేసీఆర్‌ ప్రత్యేకించి చెప్పారు.

హరీష్‌ రావుకు మంత్రి కేటీఆర్ , క‌విత మ‌ద్ద‌తు
మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీ-ఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్‌ వేదికగా కేటీ-ఆర్‌ చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌కు హరీశ్‌రావు ఒక మూలస్తంభం అని.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో సేవ చేశారన్నారు. అందుకే హరీశ్‌రావుకు తామంతా అండగా ఉన్నామని కేటీ-ఆర్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

అలాగే ఎమ్మెల్సీ క‌విత సైతం మైనంపాటి వ్యాఖ్యాల‌పై మండిప‌డ్డారు.. ఇటువంటి వ్యాఖ్యాలు చేయ‌డం అర్ధ‌ర‌హిత‌మ‌న్నారు..

- Advertisement -

జాబితానే ఫైనల్‌ కాదు.. మార్పులుంటాయి: కేసీఆర్‌
మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ వేటు- వేస్తే అక్కడ్నుంచి ఎవర్ని బరిలోకి దింపుతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ప్రెస్‌మీట్‌ లో ఈ జాబితానే ఫైనల్‌ కాదని.. మార్పులు, చేర్పులు ఇకముందు కూడా ఉండొచ్చని కూడా చెప్పారు. ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాత
తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement