Saturday, November 23, 2024

రాజస్తాన్​-గుజరాత్ మ్యాచ్ లో హార్దిక్ రికార్డు.. దిగ్గజ ప్లేయర్స్ స‌ర‌స‌న‌ పాడ్యా

ఈ ఐపీఎల్ ఇవ్వాల జరుగున్న మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించిన గుజరాత్.. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌తో ఐదో మ్యాచ్ ఆడుతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన ఆటతీరుతో పాటు కెప్టెన్సీ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాన్ని అందిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 2 వేల పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఐపీఎల్‌ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 2012 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 50 వికెట్లు పడగొట్టాడు. 2 వేల పరుగుల మైలురాయితో పాటు 50 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హార్ధిక్. మొత్తంగా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఆరో ఆల్ రౌండర్‌గా హార్ధిక్ నిలిచాడు.

హార్దిక్ కంటే ముందు ఈ ఘనత సాధించిన ప్లేయర్స్..

షేన్ వాట్సన్ – 3874 పరుగులు, 92 వికెట్లు

కీరన్ పోలార్డ్ – 3412 పరుగులు, 69 వికెట్లు

- Advertisement -

రవీంద్ర జడేజా – 2531 పరుగులు, 138 వికెట్లు

జాకస్ కల్లీస్ – 2427 పరుగులు, 65 వికెట్లు

ఆండ్రూ రసెల్ – 2074 పరుగులు, 92 వికెట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement